ఆర్టీసీ సమ్మె ప్రారంభంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే సానుకూలత ప్రదర్శిస్తే ఇంతమంది కార్మికులు చనిపోయేవారు కాదని మందకృష్ణ మాదిగ అన్నారు. కేసీఆర్ నిరంకుశ వైఖరే ఇన్ని అనార్థాలకు కారణమని దుయ్యబట్టారు. ఆర్టీసీకి వంద కోట్లు ఇస్తామన్న కేసీఆర్.. హైకోర్టు అడిగినప్పుడు 47 కోట్లు ఇచ్చి ఉంటే కొంతమంది ప్రాణాలైన మిగిలేవని పేర్కొన్నారు.
'ముందే స్పందిస్తే... ఆ ప్రాణాలు దక్కేవి కదా?' - మందకృష్ణ తాజా వార్త
ఆర్టీసీ సమస్యపై కేసీఆర్ ఆలస్యంగా స్పందించారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ముందే స్పందిస్తే ఆత్మహత్యలు, గుండెపోటుతో మరణించిన వారు బతికి ఉండేవారని తెలిపారు.
!['ముందే స్పందిస్తే... ఆ ప్రాణాలు దక్కేవి కదా?' manda-krishna-comment-on-cm-kcr-in-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5222077-332-5222077-1575086216095.jpg)
'సమ్మె ప్రారంభంలో ఈ ఔదార్యం ఏమైంది..?'