పారిశ్రామిక రంగంలో విశిష్ట సేవలందిస్తోన్న వివిధ సంస్థల మేనేజర్లను మరింత ప్రోత్సాహించేందుకు హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్(హెచ్ఎంఏ) ఆవార్డుల కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈనెల 16న కొండాపూర్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందని అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు. ముఖ్యఅతిధిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకానున్నారని తెలిపారు.
ఈనెల 16న హెచ్ఎంఏ అవార్డుల కార్యక్రమం - అవార్డుల కార్యక్రమం
2017-18 సంవత్సరంలో పరిశ్రమ రంగంలో విశిష్ట సేవలకు గాను మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్‌ను ఎంపిక చేసినట్లు హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తెలిపింది. అవార్డుల కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు.
ఈనెల 16న హెచ్ఎంఏ అవార్డుల కార్యక్రమం