హైదరాబాద్ తార్నాకలోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రాహుల్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తార్నాకలోని శ్రీకర్ శ్రీవాస్ అపార్ట్మెంట్ మూడో అంతస్తులోని 306 నెంబర్లోని తన ఫ్లాట్‌లో స్లాబ్ కొక్కానికి తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహం దుర్వాసన రాగా.. అతను చనిపోయి రోజులు గడిచి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.
ఇఫ్లూ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఆత్మహత్య - man working as assistant professor in eflu died
హైదరాబాద్ తార్నాకలోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రాహుల్.. తన నివాసంలోని స్లాబ్ కొక్కానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహం నుంచి దుర్వాసన రాగా అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారమిచ్చారు.
![ఇఫ్లూ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఆత్మహత్య man working as assistant professor in eflu died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8133553-1065-8133553-1595435428714.jpg)
ఇఫ్లూలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌గా పనిచేసే వ్యక్తి ఆత్మహత్య
అయితే అతని ఇంట్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఓ కాగితం దొరికింది. అందులో రెండు ఫోన్ నెంబర్లు రాసి ప్లీజ్ కాల్ మై ఫాదర్ అని రాసి ఉంది. ఆ పేపర్లో ఉన్న నంబరుకు సమాచారమివ్వగా అతని తండ్రి వచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రాహుల్ డిప్రెషన్‌తో మరణించి ఉంటాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.