తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా భయంతోనే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.. - కంచికచర్లలో కరోనా వార్తలు

కరోనా వైరస్... ఆనందంగా ఉండే కుటుంబాల్లో కన్నీరు నింపుతోంది. ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్లలో శ్రీనివాసరావు అనే వ్యక్తి అదృశ్యం కలకలం రేపుతోంది. కరోనా సోకిందనే భయంతో శ్రీనివాసరావు ఈనెల 4న ఇంటి నుంచి వెళ్లి పోయాడని బంధువులు చెబుతున్నారు.

corona effect-man missing
కరోనా భయంతోనే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు..

By

Published : Jul 10, 2020, 10:23 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా కంచికచర్లలో ఓ వ్యక్తి అదృశ్యం అయ్యాడు. కరోనా సోకిందనే భయంతోనే ఇంటి నుంచి వెళ్లిపోయాడని బంధువులు చెబుతున్నారు. కంచికచర్లకు చెందిన శ్రీనివాసరావు జ్వరం రావటంతో స్థానికంగా ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. తరువాత విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. వైద్యుల సలహాపై శ్రీనివాసరావు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షకు శాంపిల్ ఇచ్చి ఇంటికి వెళ్లాడు.

రాత్రంతా ఇంట్లోనే ఉన్న అతను ఈనెల 4 తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. వారం రోజుల నుంచి బంధువులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావు ఆచూకీ తెలపాలంటూ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

కరోనా భయంతోనే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు..

ఇదీ చూడండి :చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా?.. అయితే జాగ్రత్త!

ABOUT THE AUTHOR

...view details