యువత ప్రత్యేకంగా కనబడేందుకు ఆసక్తి చూపుతుంటారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఓ భక్తుడు ఒండినిండా బంగారు గొలుసులు ధరించి.. యాత్రికుల్లో ప్రత్యేకంగా కనబడ్డాడు.
ఏడు కొండలపైన బంగారు కొండ - తిరుమలకు బంగారు ఆభరణాలు ధరించి వచ్చిన యువకుడు న్యూస్
నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనే ఆసక్తి ఎవరికైనా ఉంటుంది. ఒక్కొక్కరిది ఒకో తీరు. ఒకరు సూటు.. బూటు వేసుకుని వస్తే.. మరొకరు కళ్లద్దాలు పెట్టుకుని తమపై దృష్టి పడేలా చేసుకుంటారు. మరికొంతమంది తీరు.. మరి ప్రత్యేకం.. విలువైన వాటిని తమపై వేసుకుంటారు. అలా ఓ వ్యకి సోమవారం తిరుమలకు వచ్చాడు. ఒంటిపై చాలా బంగారం వేసుకున్నాడు.
ఏడు కొండలపైన బంగారు కొండ
లావాటి బంగారు ఆభరణాలను మెడలో వేసుకుని.. చేతికి కడియాలు తొడిగి కనపడిన హైదరాబాద్‌కు చెందిన.. రాహుల్ అనే యువకుడిని చూసేందుకు యాత్రికులు ఆసక్తి కనబరిచారు.
ఇదీ చదవండి:ఎన్నికల వరకే రాజకీయాలు: బండి సంజయ్