హైదరాబాద్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న కమేలా సమీపంలో ఉన్న మోరిలో పడి అదే ప్రాంతానికి చెందిన విజయ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందిచారు. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
మోరిలో పడి వ్యక్తి అనుమానాస్పద మృతి - చిన్న కమేలాలోని మోరిలో పడి వ్యక్తి అనుమానాస్పద మృతి
హైదరాబాద్ చిన్న కమేలా సమీపంలో ఉన్న మోరిలో పడి అదే ప్రాంతానికి చెందిన విజయ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మోరిలో పడి వ్యక్తి అనుమానాస్పద మృతి
విజయ్‌కి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మద్యానికి బానిసైన విజయ్ను భరించలేక భార్య కొన్నాళ్ల క్రితమే పుట్టింటికి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. ఈ మృతికి భార్యాభర్తల మధ్య గొడవలే కారణమా... లేక మరెవరైనా హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:ఎంపీ రేవంత్‌రెడ్డికి బెయిల్ మంజూరు