హైదరాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెస్లీ కళాశాల సమీపంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. మృతుడు రసూల్‌పురాకు చెందిన జావిద్‌గా పోలీసులు గుర్తించారు.
యువకుడు మృతి.. మత్తు ఎక్కువైందని అనుమానం - man death in hyderabad
బేగంపేట పీఎస్ పరిధిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు రసూల్‌పురాకు చెందిన జావిద్‌గా పోలీసులు గుర్తించారు. జావిదే మత్తుపదార్థాల వల్లే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
గత కొంత కాలంగా మత్తు పదార్థాలకు, గంజాయికి బానిసయ్యాడని పోలీసులు తెలిపారు. నిన్న రాత్రి మోతాదుకు మించి మత్తుపదార్థాలు సేవించడం వల్లే జావిద్ చనిపోయి ఉంటాడని పోలీసుసలు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి:10 గ్రేడ్లపై ముమ్మర కసరత్తు .. విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్