హైదరాబాద్‌లోని ఉందానగర్, బద్వేలు రైల్వేస్టేషన్ల మధ్య ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి కాచిగూడ పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహం వద్ద దొరికిన ఆధారాల ప్రకారం మృతుడు ఫరూక్నగర్ మండలం కంసానిపల్లికి చెందిన గోవు నరేష్(22)గా గుర్తించారు. సోమాజీగూడ యశోద ఆస్పత్రి క్యాంటీన్లో నరేశ్ పనిచేస్తున్నట్లు తెలిసింది. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
రైలుకింద పడి యువకుడు ఆత్మహత్య... - యశోద ఆస్పత్రి క్యాంటీన్లో పనిచేస్తున్న ఓ యువకుడు
సోమాజీగూడ యశోద ఆస్పత్రి క్యాంటీన్లో పనిచేస్తున్న ఓ యువకుడు ఉందానగర్, బద్వేలు రైల్వేస్టేషన్ల మధ్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఫరూక్నగర్ మండలం కంసానిపల్లికి చెందిన గోవు నరేష్‌గా పోలీసులు గుర్తించారు.
MAN SUICIDE ON RAILWAY TRACK AT KACHIGUDA STATION