Man Suicide for Loan App Harassment : ఓ యువకుడు చేసిన అప్పులు తీర్చుకోవడానికి క్రికెట్బెట్టింగ్ (Cricket Betting)మొదలు పెట్టాడు. కానీ అందులో కూడా అతనికి చేదు అనుభవం ఎదురైంది. అతను చేసిన అప్పులు మితిమీరిపోయాయి. ఇక తాను చేసిన అప్పులు తీర్చేందుకు లోన్ యాప్ మార్గాన్ని ఎంచుకున్నాడు. దాని ద్వారా డబ్బులు తీసుకున్నాడు. కానీ ఆ లోన్ యాప్ వేధింపులు భరించలేక ఆ యువకుడు చివరికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
Online loan App Harassment Cases : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో శివ (29)అనే యువకుడు నిన్న రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పు గోదావరికి(East Godavari) చెందిన శివ, తల్లిదండ్రులతో ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్నాడు. అతను మెడికల్ రిప్రజెంటివ్ పని పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో యువకుడు పలు లోన్ యాప్స్ ద్వారా లోన్ తీసుకున్నాడు.
Digital loans precautions : డిజిటల్ రుణాలు తీసుకుంటున్నారా?.. తస్మాత్ జాగ్రత్త!
Loan App Torture: లోన్ యాప్స్ బాధ భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
'నా కుమారుడు బాగా చదువుకున్నాడు. కానీ తీసుకున్న లోన్ యాప్లో అవతల వ్యక్తి బెదిరింపులు చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరైతే బెదిరింపులు పాల్పడి నా కుమారుడుని నాకు దూరం చేశారో, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి'-వెంకటేశ్, మృతుడి తండ్రి