తెలంగాణ

telangana

ETV Bharat / state

Hyderabad Minor Girl rape : రక్షించాల్సిన వాడే రాక్షసుడై.. బాలికపై అత్యాచారం - Man Rapes his Niece in Hyderabad

Orphan Minor Girl Rape in Hyderabad: తల్లిదండ్రులు లేక అనాథ అయిన బాలికను సంరక్షించాల్సిన చిన్నాన్నే రాక్షసుడిగా ప్రవర్తించాడు. అనాథాశ్రమంలో రక్షణ పొందుతున్న బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పంజాగుట్టలోని మధురానగర్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Man Raped A Orphan Minor Girl
Man Raped A Orphan Minor Girl

By

Published : Jun 6, 2023, 2:07 PM IST

Man Rapes his Niece in Hyderabad :తల్లి గర్భం నుంచి బయట ప్రపంచం వరకు ఆడపిల్లలకు ఎక్కడ రక్షణ లేకుండాపోతోంది. గర్భం నిర్ధారణ పరీక్షలు చేసి పుట్టేబోయేది ఆడశిశువు అని తెలియగానే అబార్షన్ చేయిస్తున్నారు. ఇక ఆడపిల్ల పుట్టిందని ఎంతో సంబురంగా ఆ గారాల పట్టిని అల్లారుముద్దుగా చూసుకుంటున్నా.. కొన్నిసార్లు ఆత్మీయుల నుంచే ఆత్మరక్షణ లేకుండా పోతోంది. నేటి సమాజంలో ఎక్కడ చూసిన పసివాళ్ల నుంచి పండు ముసలి వాళ్ల వరకు అఘాయిత్యాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నవారే.

Man Rapes his Brother's daughter in Hyderabad :సరైన కుటుంబ సంరక్షణలో పెరుగుతున్న ఆడపిల్లలకే సరైన రక్షణ ఉండటం లేదు. ఇక నా అన్నవాళ్లు ఎవరూ లేని అనాథల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తల్లిదండ్రులను కోల్పోయి.. ఆత్మీయులు వెలివేస్తే.. ఉండటానికి చోటు లేని వారంతా అనాథాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ అనాథాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్న చాలా మంది ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోందన్న ఆరోపణలు ఉన్నాయి. వారిపై ఎవరు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా అడిగే నాథుడే లేదని కొంతమంది కామాంధులు రెచ్చిపోతున్నారు. ఇక కొంతమంది.. ఆడపిల్లల బంధువులు.. చేరదీస్తామనే పేరుతో ఆడపిల్లలపై చేస్తున్న అరాచకాలకు అడ్డూఅదుపే లేకుండా పోతోంది. తాజాగా హైదరాబాద్​లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. నాన్న తర్వాత నాన్నలా ప్రవర్తించాల్సిన చిన్నాన్న.. కన్నతండ్రి స్థానంలో బాధ్యత తీసుకోవాల్సిన చిన్నాన్నే..అనాథాశ్రమంలో ఉన్న అన్న కూతురిని నమ్మించి తన వెంట తీసుకెళ్లి ఆత్యాచారం చేశాడు. హైదరాబాద్​ పంజాగుట్టలోని మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మధురా నగర్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..తల్లిదండ్రులు లేని 15 ఏళ్ల బాలికను ఏప్రిల్ నెలలో ఆమె అమ్మమ్మతో పాటు చిన్నాన్న వరసయ్యే ఓ వ్యక్తి అనాథాశ్రమంలో చేర్పించారు. ఇటీవల ఆ బాలికకు పరీక్షలు ఉండడంతో.. ఆమె చిన్నాన్న ఆ బాలికతో పరీక్షలు రాయిస్తానని చెప్పి వెంట తీసుకెళ్లాడు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఉన్నత చదువులు చదివిస్తాని, అన్నీ తానై చూసుకుంటానని ఆ అమాయికురాలిని నమ్మించి గదిలోకి తీసుకువెళ్లి ఆమెపై ఆత్యాచారానికి పాల్పాడ్డాడు. తర్వాత బాలికకు ఓ సెల్ ఫోన్​ను ఇచ్చి తిరిగి ఆశ్రమంలో దించి వెళ్లాడు.

తనకేం జరిగిందో అర్థం కాని బాలిక.. తన చిన్నాన్న ఇచ్చిన మొబైల్ తీసుకుని ఆశ్రమానికి వెళ్లింది. సెల్​ ఫోన్​ను రహస్యంగా భద్రపరుచుకుని నిందితుడు ఫోన్ చేసినప్పుడు ఎవరికీ తెలియకుండా మాట్లాడేది. ఇది గమనించిన అనాథ ఆశ్రమంలోని ఇతర బాలికలు ఈ విషయాన్ని నిర్వాహకులకు తెలిపారు. నిర్వాహకులు బాలికను నిలదీయగా అసలు విషయం చెప్పింది. విషయం తెలుసుకున్న వారు.. మధురా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details