తోడబుట్టిన సోదరి నుంచే తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందంటూ... ఓ బాధిత మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. హైదరాబాద్ కాచిగూడలోని నింబోలి అడ్డాలో తన భర్త, ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటున్నట్లు బాధిత మహిళ ఆర్మీయా సుల్తానా కమిషన్‌కు వివరించింది. గత నెల 9న తన అక్క అయిన ఆసేవియా సుల్తానా ఆస్తి కోసం ఆమె భర్తతో కలిసి... తన భర్త మహమూద్ అబ్దుల్ రెహమాన్‌ను ఆజాంపురాలో హత్య చేయించినట్లు తెలిపింది. ఈ ఘటనతో చాదర్‌ఘాట్ పోలీసులు తన సోదరి భర్తను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని వెల్లడించింది.
మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన బాధిత మహిళ - man murder
తన సొంత అక్కే ఆస్తి కోసం తన భర్తను చంపించిందని... ఇప్పుడు తనను, పిల్లలను హతమారుస్తానని బెదిరింపులకు పాల్పడుతోందని ఓ మహిళ హెచార్సీని ఆశ్రయించింది. తనకు తన పిల్లలకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను వేడుకుంది.
హత్యకు సూత్రధారి అయిన తన సోదరిపై ఎటువంటి కేసులు పెట్టకుండా వదిలేశారని ఆవేదన వ్యక్తం చేసింది. గత కొన్ని రోజులుగా తాను ఉంటున్న ఇంటిని వదిలి వెళ్లకపోతే తనను, తన ముగ్గురు పిల్లలను హతమారుస్తానని తన అక్క బెదిరింపులకు పాల్పడుతోందని చెప్పింది. ఈ విషయంపై స్థానిక కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కమిషన్ ముందు కన్నీరు పెట్టుకుంది. తనకు, తన పిల్లలకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఆమె కమిషన్‌ను వేడుకుంది. బాధిత మహిళకు పలు మహిళా సంఘాలు మద్దతు పలికాయి.
ఇవీ చూడండి: దారుణం: తండ్రిని చంపిన తనయుడు