ఈనెల 10వ తేదీన చిలగలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆలుగడ్డ భావి ప్రాంతానికి చెందిన దుబ్బాక రమేశ్ అనే వ్యక్తి స్థానిక మార్కెట్ వద్ద ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే యువతి చిలకలగూడ పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా.. సిటీ సివిస్ కోర్టు అతనికి మూడు రోజుల జైలు శిక్ష, జరిమానా విధించింది.
మహిళను వేధించిన కేసులో వ్యక్తికి జైలు శిక్ష - latest women hurrasment news in chilakalaguda
చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను వేధిస్తున్న కేసులో ఈనెల 10న అరెస్టైన దుబ్బాక రమేశ్ అనే వ్యక్తికి సిటీ సివిల్ కోర్టు మూడు రోజుల జైలు శిక్ష, జరిమానా విధించింది.
మహిళను వేధించిన కేసులో వ్యక్తికి జైలు శిక్ష