నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడి ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చిలకలగూడ ఈద్గా సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి కార్మికుడు సోమయ్య మృతి చెందాడు. ఈరోజు ఉదయం నిర్మాణ పనుల నిమిత్తం వచ్చిన సోమయ్య... భవనం రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడగా... అతని తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు.
నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి - Telangana news
సికింద్రాబాద్ చిలకలగూడ ఈద్గా పరిధిలో నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి ఓ కార్మికుడు మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి
విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు... ఘటనా స్థలానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బిల్డింగ్ ఎదుట బైఠాయించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.