రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ మృతి - రోడ్డు ప్రమాదం
హైదరాబాద్లో జూన్ 3వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన హోంగార్డ్ని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ అంబర్పేటలో జూన్ 3న చే నంబర్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన శ్రీనివాస్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేసే హోంగార్డు రాంగ్ రూట్లో వచ్చి శ్రీనివాస్ వాహనాన్ని ఢీ కొట్టాడు. తీవ్ర గాయాలైన అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతన్న శ్రీనివాస్ ఈరోజు ఉదయం మరణించాడు. ప్రమాదానికి కారణమైన హోంగార్డుని కఠినంగా శిక్షించాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.