సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లాపూర్‌లో తన భార్యను కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడని అజయ్ అనే వ్యక్తిపై నలుగురు దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఉన్న అతను గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల కథనం ప్రకారం
నాలుగేళ్ల క్రితం మాదాపూర్ శ్రీచైతన్య కాలేజీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న అజయ్‌కు సనత్ నగర్లో ఉండే చిట్టి అనే మహిళ పరిచయమైంది. ఆమెకు లక్ష్మి అనే కూతురు ఉంది. చిట్టీతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అజయ్.. తరువాత లక్ష్మిని తనకు ఇచ్చి పెళ్లి చేయాలని అడిగాడు... కానీ లక్ష్మి, శ్రీశైలం అనే మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.