నాలాలో పడి వ్యక్తి మృతి - నాలాలో పడి వ్యక్తి మృతి
నాలాలో పడి ఓ వ్యక్తి మరణించిన ఘటన హైదరాబాద్ సనత్‌నగర్‌లోని దీన్‌దయాల్ బస్తీలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

నాలాలో పడి వ్యక్తి మృతి
హైదరాబాద్ సనత్‌నగర్‌లోని దీన్‌దయాల్ బస్తీలో రమేశ్(38) అనే వ్యక్తి చెత్త ఏరుకుంటున్నాడు. ఆ పక్కనే ఉన్న నాలాలో కాలుజారి పడ్డాడు. ఈత రాకపోవడం వల్ల మృతి చెందాడు. రమేశ్ అదే బస్తీకి చెందినవాడిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
నాలాలో పడి వ్యక్తి మృతి