బ్లాక్‌ఫంగస్ సోకి చూపు కోల్పోయిన వ్యక్తి.. మనస్తాపంతో ఆత్మహత్య - Suicide with Blank Fungus
11:17 January 16
Suicide with Blank Fungus: ఉస్మానియాలో చికిత్స పొందుతూ మృతి
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పరిధిలో ఓ వ్యక్తి.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమవతిపేట్కు చెందిన ఓ వ్యక్తికి కొన్నిరోజుల క్రితం బ్లాక్‌ఫంగస్ సోకింది. దీంతో అతను చూపు కోల్పోయాడు. అప్పటి నుంచి అతను తీవ్ర మనస్తాపం చెందాడు. కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా అతను ఆ బాధను జయించలేకపోయాడు.
దీంతో తీవ్రమనస్తాపంతో.. పురుగులమందు తాగాడు. గుర్తించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియాలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుమారుడి మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇదీ చూడండి:యువకుడి మెడకు బిగుసుకున్న తాడు- అలాగే లాక్కెల్లిన ఎద్దు..!