తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రియురాలి పెళ్లి రోజే ప్రియుడి ఆత్మహత్య - love

ప్రేమించిన యువతి మరో యువకుడిని పెళ్లి చేసుకోబోతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న యువకుడు తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపం చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

boyfriend committed suicide on lover wedding day in secunderabad
ప్రియురాలి పెళ్లి రోజే ప్రియుడి ఆత్మహత్య

By

Published : Mar 18, 2020, 8:48 AM IST

ప్రేమించిన యువతి మరొకరిని వివాహం చేసుకుంటుందని తెలుసుకున్న ప్రియుడు.. ఆమె పెళ్లి రోజే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్​ పరిధిలో చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే...

మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన సదానందం(23) నాచారంలో ఉంటూ ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతను ఓ యువతిని ప్రేమించాడు. ఆమెకు మరో యువకుడితో వివాహ నిశ్చితార్థమైంది. ఈ నెల 16న ఆమె వివాహం. విషయం తెలుసుకున్న యువకుడు ఈ నెల 15న రాత్రి అతడు స్నేహితులతో కలసి మద్యం తాగాడు. తాను ప్రేమించిన యువతి మరొకరితో వివాహం చేసుకుంటుందని బాధపడ్డాడు. స్నేహితులు అతనికి ధైర్యం చెప్పిన ఫలితం లేకపోయింది.

సోమవారం ఉదయం మౌలాలి-చర్లపల్లి రైల్వేస్టేషన్ల మధ్య రైలు పట్టాల పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గమనించిన రైల్వే కీమాన్‌ విషయాన్ని జీఆర్పీ పోలీసులకు చేరవేశాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వద్ద గుర్తింపు ఆధారాలు లభించలేవు. మృతదేహాన్ని గాంధీ శవాగారానికి తరలించారు.

అదే రోజు నుంచి కుటుంబ సభ్యులు సదానందంకు ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ ఉంది. సోమవారం సాయంత్రం నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులు తమ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు తెలియజేసి ఆ ఫొటోను పంపించారు. అదృశ్యమైన యువకుడి ఫొటో మృతుడి ఫొటో ఒకేలా ఉండటంతో విషయాన్ని పోలీసులు బాధితులకు చెప్పారు. మంగళవారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చిన మృతుడి కుటుంబసభ్యులకు మార్చురీలోని మృతదేహాన్ని పోలీసులు చూపించగా సదానందంగా గుర్తించారు. ప్రేమించిన యువతి మరొకరితో వివాహం చేసుకుంటుందని.. ఆ బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడని అతని స్నేహితులు పోలీసులకు వివరించారు.

ఇదీ చూడండి:త్వరలో ప్రైవేటు ల్యాబ్​ల్లోనూ కరోనా పరీక్షలు

ABOUT THE AUTHOR

...view details