MAN CLIMBS UP ELECTRIC TOWER:హైదరాబాద్ అంబర్‌పేటలో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. తన తోపుడు బండిని ఎవరో దొంగిలించారని ఆరోపిస్తూ స్థానికంగా నివసించే మోహన్‌బాబు హై టెన్షన్ టవర్ ఎక్కాడు. స్థానికులు ఎంతలా బతిమాలినా కిందకు దిగలేదు.
తోపుడు బండి కోసం.. హై టెన్షన్ టవర్ ఎక్కి వ్యక్తి హల్‌చల్ - హైదరాబాద్ తాజా వార్తలు
MAN CLIMBS UP ELECTRIC TOWER: తన తోపుడు బండిని ఎవరో దొంగిలించారని దాన్ని తెచ్చి ఇవ్వాలని ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. విద్యుత్ సరఫరా ఉండటం వల్ల అతడిని కిందకి దింపేందుకు పోలీసులు , స్థానికులు నానా ప్రయాసలు పడ్డారు. చివరికి పోలీసుల జోక్యంతో అతడు దిగి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
విద్యుత్ టవర్ ఎక్కిన మోహన్‌బాబు
సమాచారం అందుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు అతడిని కిందకు దింపేందుకు నానా తంటాలు పడ్డారు. నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. పోలీసులు కొత్త తోపుడు బండిని ఇప్పిస్తామని చెప్పడంతో అతను టవర్ దిగాడు. దీంతో అక్కడున్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: DGP rejoined in duties: రెండు వారాల తర్వాత విధుల్లో చేరిన డీజీపీ