హైదరాబాద్‌లోని నాచారానికి చెందిన ఝాన్సీ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో సహా ఉద్యోగి శేఖర్‌తో పరిచయం స్నేహంగా మారి ప్రేమకు దారితీసింది. వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల తరువాత కులాలు వేరని.. కట్నం తీసుకొని రావాలని చెప్పి ఝూన్సీని వదిలేసి వెళ్లాడు. పెద్దలతో చెప్పించే ప్రయత్నం చేసినా శేఖర్ వినకపోవడం వల్ల ఝాన్సీ నాచారం పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణలో శేఖర్ మరో పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. తనను మోసం చేసిన శేఖర్‌పై చర్యలు తీసుకోవాలని ఝాన్సీ కోరుతోంది.
ప్రేమన్నాడు... పెళ్లి చేసుకున్నాడు... వదిలేశాడు - ప్రేమన్నాడు... పెళ్లి చేసుకున్నాడు... వదిలేశాడు
స్నేహం చేశాడు, ప్రేమ అన్నాడు... నీవు లేనిది నేను లేను అన్నాడు... పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్ల తరువాత కులాలు వేరని చెప్పి అమ్మాయిని వదిలేసి వెళ్లాడు. దిక్కుతోచని స్థితిలో తనకు న్యాయం చేయాలని ఆ యువతి నాచారం పోలీసులను ఆశ్రయించింది.
ప్రేమన్నాడు... పెళ్లి చేసుకున్నాడు... వదిలేశాడు