Student copying in Group 1 exam in AP : ఏపీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సందర్భంగా విజయవాడలో వార్డు సచివాలయ ఉద్యోగి సెల్‌ఫోన్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడటం కలకలం రేపుతోంది. పోరంకి చెందిన కొల్లూరి వెంకటేష్ సీతారాంపురం సచివాలయం వార్డు అడ్మిన్ సెక్రటరీగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. సచివాలయ ఉద్యోగి వెంకటేష్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను చంద్రబాబునాయుడు కాలనీలోని నారాయణ కళాశాలలో రాశాడు.
గ్రూప్-1 పరీక్షలో చీటింగ్.. మొబైల్‌లో చూస్తూ కాపీయింగ్ - Student copying in Group 1 exam
Student copying in Group 1 exam in AP: గ్రూప్-1 పరీక్ష చాలా పకడ్బందీగా నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లే ముందు.. క్షుణ్నంగా పరిశీలిస్తారు. కానీ అటువంటి పరీక్షలో ఓ వార్డు సచివాలయ ఉద్యోగి సెల్ఫోన్లో చూసి కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. సెల్‌ఫోన్‌ను ఎలా పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లాడు అనేది పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ సంఘటన ఏపీలోని విజయవాడలో చోటుచేసుకుంది.

Group 1 exam
పోలీసుల కళ్లు కప్పి చరవాణిని పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్లిన వెంకటేష్.. అంతర్జాలంలో చూస్తూ సమాధానాలు రాస్తుండగా గమనించి ఇన్విజిలేటర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశారు. అత్యంత పకడ్బందీగా నిర్వహించే గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా బయటపడింది. తనిఖీలను దాటుకొని పరీక్ష కేంద్రంలోకి చరవాణిని తీసుకెళ్లడం, గంటసేపు తర్వాత గుర్తించటం.. పలు అనుమానాలకు తావిస్తోంది.