తెలంగాణ

telangana

ETV Bharat / state

పోడుభూముల వ్యవహారంపై సీఎం సమీక్షించాలి: మల్లు రవి

పోడు భూముల వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్​  సమీక్షించి గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్‌ నేత మల్లు రవి డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారని ఆరోపించారు.

పోడుభూముల వ్యవహారంపై సీఎం సమీక్షించాలి

By

Published : Jul 3, 2019, 7:57 PM IST

కాంగ్రెస్​ హాయాంలో తెచ్చిన పోడు భూముల చట్టాన్ని అమలుచేయాలని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్​ చేశారు. గిరిజనుల సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత సర్కారుపై ఉందన్నారు. కాంగ్రెస్‌ నుంచి భాజపాలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయన్న వార్తలను మల్లు రవి ఖండించారు. భాజపాకు ఇతర పార్టీల మీద ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై లేదని విమర్శించారు. తెరాసకు బీజేపి ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదన్నారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నుంచి 12మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరితే తప్పని చెప్పిన కమలం నేతలు ఏపీలో నలుగురు ఎంపీలను ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు.

పోడుభూముల వ్యవహారంపై సీఎం సమీక్షించాలి: మల్లు రవి

ABOUT THE AUTHOR

...view details