తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్  రైతు సంక్షేమ పార్టీ: మల్లు రవి - హైదరాబాద్ తాజా వార్తలు

Mallu Ravi Latest News: 'రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్​ను ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు.

మల్లు రవి
మల్లు రవి

By

Published : May 28, 2022, 1:12 PM IST

Mallu Ravi Latest News: కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమ పార్టీ అని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. రైతు డిక్లరేషన్​ను ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని హయత్​నగర్​లో నిర్వహించిన పాదయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హయత్​నగర్ డివిజన్​ లోని పలు కాలనీలలో తిరుగుతూ తెరాస ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెలరోజుల్లోనే రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామని చెప్పారు. రైతును రాజు చేయడం కాంగ్రెస్​తోనే సాధ్యమని మల్లు రవి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ నియోజక వర్గ కో ఆర్డినేటర్ మల్​రెడ్డి రామ్​రెడ్డి, పలు డివిజన్ల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

"వాళ్ల సొంత ఎమ్మెల్యేలకే అపాయింట్​మెంట్ లేదు. ప్రతిపక్షనాయకులను మాట్లాడే అవకాశం లేదు. ఒక నియంత, ఒక రాజు పరిపాలన చేస్తే ఏవిధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది తెలంగాణలో." -మల్లు రవి పీసీసీ ఉపాధ్యక్షుడు

"కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరంలో అధికారంలో రాబోతుంది. వెంటనే ఒకే దఫాగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ. రైతులకు ఎకరానికి రూ.15వేలు, అదేవిధంగా కౌలు రైతులకు రూ.15వేలు ఇస్తాం. ధరణి పోర్టల్​ను వెంటనే రద్దుచేస్తాం." -మల్​రెడ్డి రామ్ రెడ్డి ఎల్బీనగర్​ నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్

కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమ పార్టీ

ఇదీ చదవండి:మధ్యాహ్న భోజన పథకంలో .. పల్లీపట్టి బదులు ఈ సారి మొలకలు, బెల్లం

తల్లి ప్రేమను చాటి చెప్పిన ఏనుగు.. బిడ్డ మృతదేహాన్ని వీడలేక నరక యాతన

ABOUT THE AUTHOR

...view details