విలీనం డిమాండ్‌ను ఆర్టీసీ కార్మికులు పక్కన పెట్టిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరపాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. ఆర్టీసీ కార్మికులు పెద్ద మనసుతో ఒక అడుగు వెనక్కి తగ్గడం మంచి పరిణామమని ఆయన తెలిపారు. 43 రోజులుగా సమ్మె చేస్తున్నా... ప్రభుత్వం స్పందించక పోవడం శోచనీయమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా పని చేస్తోందని ఆరోపించారు. ఈనెల 18వ తేదీ లోపు చర్చలు జరిపి... హైకోర్టుకు నివేదిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. అయినా కూడా ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తే సీఎం కేసీఆర్ భారీ మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు.
ఈ నెల 18వ తేదీలోపు చర్చలు జరపాలి: మల్లు రవి
ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి డిమాండ్ చేశారు. ఈ నెల 18 లోపు చర్చలు జరిపితే సమస్య పరిష్కారమవుతుందని వెల్లడించారు.
ఈ నెల 18వ తేదీలోపు చర్చలు జరపాలి: మల్లు రవి