మున్సిపల్ ఎన్నికలలో తెరాస విచ్చలవిడిగా డబ్బు, మద్యం, బంగారం, ఇతర కానుకలు ఓటర్లకు పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. తెరాస పాలన సక్రమంగా ఉన్నట్లయితే ఆ పార్టీ అభ్యర్థులు ఎందుకు తాయిలాలు పంచుతారని ప్రశ్నించారు. గులాబీ పార్టీ పాలనపై ఆ పార్టీ వాళ్లకే నమ్మకం లేదని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెరాసకు బుద్ధి చెప్పాలని మల్లు రవి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది' - 'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'
పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్న భయంతోనే తెరాస అడ్డగోలు అక్రమాలకు పాల్పడుతోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆయన మండిపడ్డారు.
mallu ravi said 'telangana state government demolishes democracy'
TAGGED:
mallu ravi latest news