తెలంగాణ

telangana

ETV Bharat / state

'హుజూర్​నగర్​ ఉపఎన్నికలో కాంగ్రెస్​కు 30 వేల మెజార్టీ ఖాయం'

హుజూర్​నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతిరెడ్డి 30 వేలకుపైగా మెజార్టీతో గెలుస్తారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ధీమా వ్యక్త చేశారు. రాష్ట్రంలో రైతులతోపాటు ఉద్యోగులు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

congress party

By

Published : Sep 25, 2019, 5:58 PM IST


ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో రైతులతోపాటు ఉద్యోగులు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల్ని కుక్క తోకతో కేసీఆర్ పోల్చారని ఆరోపించారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. అందుకే నిరుద్యోగులు అంతా కసిగా ఉన్నారన్న ఆయన... హుజూర్​నగర్​ ఉప ఎన్నికల్లో కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెబుతారన్నారు. విష జ్వరాలతో పెద్ద ఎత్తున ప్రజలు చనిపోతుంటే... ఆసుపత్రులను డెంగీ జ్వరాల వివరాలు చెప్పవద్దని ప్రభుత్వం భయపెడుతోందని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుప్పకూలిపోయిందన్నారు. బడ్జెట్‌లో 36 వేల కోట్ల రూపాయలు కోత పెట్టారని ధ్వజమెత్తారు. ఏ ముఖ్యమంత్రి కూడ సంక్షేమ పథకాలకు ఇంత పెద్ద ఎత్తున కోత పెట్టిలేదని పేర్కొన్నారు.

'హుజూర్​నగర్​ ఉపఎన్నికలో 30 వేల మెజార్టీ ఖాయం'

ABOUT THE AUTHOR

...view details