తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం: మ‌ల్లు ర‌వి - మల్లు రవి తాజా వార్తలు

Mallu Ravi Latest News: కాంగ్రెస్ నాయకుల కృషితోనే కొల్లాపూర్ సభ విజయవంతమైందని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మ‌ల్లు ర‌వి తెలిపారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సభలో తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు.

Mallu Ravi talking
మాట్లాడుతున్న మల్లు రవి

By

Published : Mar 14, 2022, 5:21 PM IST

Mallu Ravi Latest News: కాంగ్రెస్ నాయ‌కుల స‌మష్టి కృషితోనే కొల్లాపూర్ స‌భ విజ‌య‌వంత‌మైంద‌ని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మ‌ల్లు ర‌వి స్పష్టం చేశారు. మ‌న ఊరు-మ‌న పోరు స‌భ‌కు దాదాపు ల‌క్ష మంది వ‌చ్చార‌ని వెల్లడించారు. ఇందుకు సహకరించిన నేతలకు ఆయ‌న కృత‌జ్ఞత‌లు తెలిపారు.

మోదీ, కేసీఆర్‌ ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా పోరాటం చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కొల్లాపూర్ సభలో తీర్మానం చేసిన‌ట్లు వివ‌రించారు. ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకునేందుకు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు.

సీడబ్ల్యూసీలో జరిగిన చర్చలో సంస్థాగత ఎన్నికలు జరిగే వరకు సోనియా గాంధీని ఏఐసీసీ అధ్యక్షురాలుగా కొనసాగాలని చేసిన ప్రతిపాదనకు టీపీసీసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అదేవిధంగా ఆగస్ట్​ నెలలో జరిగే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షులుగా నియమించాలని కోరుతున్న‌ట్లు మ‌ల్లు ర‌వి వెల్ల‌డించారు.

ఇదీ చదవండి: రాజగోపాల్​రెడ్డి ఘాటు వ్యాఖ్యలతో అసెంబ్లీలో రగడ

ABOUT THE AUTHOR

...view details