తెలంగాణ

telangana

ETV Bharat / state

'సునీల్‌ కనుగోలుకు కాంగ్రెస్ వార్ రూమ్‌కు ఎలాంటి సంబంధం లేదు' - కాంగ్రెస్ వార్ రూమ్​ కేసు

Mallu Ravi Investigation Ended: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్​లో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విచారణ ముగిసింది. సుమారు 3 గంటల పాటు సైబర్ క్రైమ్ పోలీసులు మల్లు రవిని విచారించారు. కాంగ్రెస్ వార్ రూమ్‌కు తానే బాధ్యుడిగా ఉన్నట్లు మల్లు రవి పేర్కొన్నారు. సునీల్‌కు.. కాంగ్రెస్ వార్ రూమ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు.

Mallu Ravi
Mallu Ravi

By

Published : Jan 18, 2023, 4:19 PM IST

Updated : Jan 18, 2023, 5:23 PM IST

Mallu Ravi Investigation Ended: సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్​లో కాంగ్రెస్‌ పీసీసీ ఉపాధ్యక్షుడు ముగిసింది. మల్లు రవిని సీసీఎస్‌ పోలీసులు మూడు గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన రవి... కాంగ్రెస్ వార్ రూమ్‌కు తానే బాధ్యుడిగా ఉన్నట్లు చెప్పారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానన్న రవి... సునీల్‌తో పాటు మిగతా ఉద్యోగుల వివరాలను పోలీసులకు తెలిపినట్లు చెప్పారు.

విచారణలో భాగంగా అవసరమైతే మళ్లీ పిలుస్తామన్నారని చెప్పారు. వార్ రూమ్‌లో వ్యవహారాలన్నింటికీ నేనే బాధ్యుడిన్న మల్లు రవి... కాంగ్రెస్ వార్ రూమ్‌ ద్వారా పోస్టవుతున్న వీడియోలకు తానే బాధ్యుడిని తెలిపారు. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం మాకు లేదని, నిబంధనలకు లోబడి మాత్రమే పోస్టింగ్‌లు చేస్తున్నట్లు చెప్పారు. పోలీసులు సునీల్ కనుగోలు గురించి కూడా అడిగారనీ, కాంగ్రెస్ వార్ రూమ్‌కు సునీల్‌కు ఎలాంటి సంబంధం లేదని మల్లు రవి తెలిపారు.

'కాంగ్రెస్ వార్ రూమ్‌కు నేనే బాధ్యుడిగా ఉన్నా. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. సునీల్‌తో పాటు మిగతా ఉద్యోగుల వివరాలను పోలీసులకు తెలిపాను. అవసరమైతే మళ్లీ పిలుస్తామని పోలీసులు చెప్పారు. వార్ రూమ్‌లో వ్యవహారాలన్నింటికీ నేనే బాధ్యుడిని. కాంగ్రెస్ వార్ రూమ్‌ ద్వారా పోస్టవుతున్న వీడియోలకు నేనే బాధ్యుడిని. సామాన్యులకు అర్థమయ్యే రీతిలోనే పోస్టింగ్‌లు చేస్తున్నాం. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు. నిబంధనలకు లోబడి మాత్రమే పోస్టింగ్‌లు చేస్తున్నాం. సునీల్‌కు.. కాంగ్రెస్ వార్ రూమ్‌కు ఎలాంటి సంబంధం లేదు.'-మల్లు రవి, పీసీసీ ఉపాధ్యక్షుడు

అంతకుముందు కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి హైదరాబాద్ సైబర్​ క్రైమ్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. పోలీసులు ఏ అంశంపై విచారణ చేస్తారనే విషయంలో నాకు ముందస్తు సమాచారం లేదన్న మల్లు రవి... పోలీసులు అడిగే ప్రశ్నలకు సహకరిస్తానని చెప్పారు. కాంగ్రెస్ వార్ రూమ్ నుంచి మా పార్టీ విలువైన సమాచారాన్ని పోలీసులు తీసుకొచ్చారని, విచారణ తర్వాత మా సమాచారం మాకిచ్చేయాలని కోరుతానన్నారు. పోలీసులు సునీల్‌ను రెండు గంటలు పాటు విచారించారన్న రవి... తనను ఎంతసేపు విచారిస్తారో తెలియదన్నారు.

డిసెంబర్​లో సునీల్‌ కనుగోలు విచారణ ముగిసిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ మల్లు రవికి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సీఆర్​పీసీ-41ఏ కింద ఆయనకు పోలీసులు నోటీసులు అందజేశారు. డిసెంబర్‌ 14న కాంగ్రెస్ వార్‌ రూమ్​లో పోలీసుల తనిఖీల సందర్భంగా పార్టీ నేతలతో కలిసి మల్లు రవి ఆందోళనకు దిగారు. ఇది తమ పార్టీ వ్యవహారాలు జరిగే కార్యాలయంగా ఆయన వాదించారు. ఈ నేపథ్యంలోనే ఈ నోటీసులు అందజేసినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Jan 18, 2023, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details