తెలంగాణ

telangana

ETV Bharat / state

Mallu ravi: రేవంత్ రెడ్డికి రాష్ట్ర మంత్రులు క్షమాపణలు చెప్పాలి - mallu ravi latest news

ఇంద్రవెల్లి సభతో తెరాస నాయకుల గుండెల్లో గుబులు పుట్టిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. మంత్రి పదవుల్లో ఉండి ఇష్టారీతిగా మాట్లడటమేంటని రాష్ట్ర మంత్రులనుద్దేశించి మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రులు చేసిన వ్యాఖ్యల పట్ల మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Mallu ravi
మల్లు రవి

By

Published : Aug 11, 2021, 3:52 PM IST

Updated : Aug 11, 2021, 4:40 PM IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై రాష్ట్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. మంత్రులుగా ఉంటూ కాళ్లు విరగ్గొడతాం, నాలుక కోస్తాం అనడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష కొత్తగా వచ్చింది కాదని.... గత కొన్నేళ్లుగా సీఎం కేసీఆర్ మాట్లాడిన భాషేనని మల్లు రవి స్పష్టం చేశారు. ఇంద్రవెల్లి సభ ఘన విజయం కావడంతో తెరాస నేతల గుండెల్లో దడ పుట్టిందని దుయ్యబట్టారు. హైదరాబాద్​ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లు రవి మాట్లాడారు.

తెరాస నాయకులంతా రేవంత్​ రెడ్డిపై ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేశారు. మంత్రుల స్థానంలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. సీఎం కేసీఆర్​ మాట్లాడిన భాషలోనే రేవంత్​ సమాధానమిచ్చారు. ఈ ఏడేళ్లలో దళితులు, గిరిజనులు, ఆదివాసీలను కేసీఆర్ నిలువునా మోసం చేశారు. ఎందుకు మోసం చేశారో రేవంత్​ రెడ్డి.. సభలో స్పష్టంగా వివరించారు. -మల్లు రవి, పీసీసీ ఉపాధ్యక్షుడు

రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలి: మల్లు రవి

దళిత బంధువు ఎలా అవుతారు.?

దళిత గిరిజన దండోరాతో కలుగులో ఉన్న నాయకులంతా బయటకు వచ్చి అరుస్తున్నారని మల్లు రవి ఎద్దేవా చేశారు. భాజపాతో రహస్య ఒప్పందం చేసుకుని తెరాస రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని విమర్శించారు. గతంలో దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం, ఇంటికో ఉద్యోగం హామీలను కేసీఆర్ గాలికొదిలేశారని ఆరోపించారు. అలాంటప్పుడు ఆయన దళిత బంధువు ఎలా అవుతారని ప్రశ్నించారు. దళిత, గిరిజనుల కోసం కాంగ్రెస్‌ చేస్తున్న పోరాటం ఆగదని మల్లు రవి స్పష్టం చేశారు. ఇంద్రవెల్లి సభ కురుక్షేత్రం మొదటి రోజు లాంటిదని.. ఇంకా యుద్ధం మిగిలే ఉందని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:TALASANI SRINIVAS: 'గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో మరింత అభివృద్ధి'

Last Updated : Aug 11, 2021, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details