తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇందిరాగాంధీ అడుగుజాడల్లో ముందుకెళుతున్నాం' - ఇందిరాగాంధీ గురించి మాట్లాడిన మల్లు రవి

హైదరాబాద్ గాంధీభవన్​లో ఇందిరాగాంధీ 35వ వర్ధంతిని పురస్కరించుకుని పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఆమె ఆలోచనలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.

ఇందిరా గాంధీకి నివాళులర్పించిన మల్లు రవి

By

Published : Oct 31, 2019, 6:22 PM IST

ఇందిరా గాంధీకి నివాళులర్పించిన మల్లు రవి

మాజీ ప్రధాని, స్వర్గీయ ఇందిరా గాంధీ ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వెళ్తోందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. ఇందిరాగాంధీ 35వ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు ఘనంగా జరుపుకున్నారని తెలిపారు. ఆమె ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను ఆయన వివరించారు. ఇందిర పాలనలో ప్రజలకు ఆర్థిక, సామాజిక న్యాయం జరిగిందని గుర్తు చేశారు. అంతకుముందు పలువురు కాంగ్రెస్ నేతలు ఆమెకు నివాళులర్పించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇందిరాగాధీ విగ్రహానికి పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.

ABOUT THE AUTHOR

...view details