రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా మల్లారెడ్డి యూనివర్సిటీ నిలిచింది. హైదరాబాద్లోని దూలపల్లిలో 100 ఎకరాల భూమిలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ దీనిని ప్రారంభించారు. ఇంజినీరింగ్, మేనేజ్ మెంట్, కామర్స్, సైన్స్ విభాగాల్లో డిగ్రీ కోర్సులను ఇక్కడ అందించనున్నారు.
''ఉన్నతమైన, నాణ్యమైన విద్యను అందించటానికి ప్రైవేటు విశ్వవిద్యాలయాలు అవసరం. దీనిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఎప్పుడో చట్టం కూడా చేసింది. ఉమ్మడి ఏపీలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అవకాశాలు కుదరలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కూడా ఉండాలని కేసీఆర్ ఆలోచించేవారు. ఆ కలను మల్లారెడ్డి నిజం చేశారు. హైదరాబాద్లో 100 ఎకరాల భూమి ఉండి... డబ్బుకోసం ఆశపడకుండా... మల్లారెడ్డి దీనిని నిర్మించారు. డబ్బు గురించి ఆశపడే వారైతే రియల్ ఎస్టేట్కే వెళ్లేవారు.''
వినోద్ కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు.