ప్రతీ సంవత్సరం నిర్వహించే కొమురవెల్లి మల్లన్న జాతర మాదిరిగానే హైదరాబాద్ ముషీరాబాద్ బాకారంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మల్లన్న జాతర మహోత్సవాలు రెండు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామికి పంచామృత అభిషేకాలు, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు బ్రాహ్మణ వేద మంత్రోచ్ఛారణాల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు.
స్వామిపై ఒగ్గు కళాకారుల పాటలు:
బుధవారం ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం అనంతరం ఎదుర్కోలు వంటి కార్యక్రమాలు జరిగాయి. స్వామి కల్యాణం తర్వాత స్వామి విగ్రహాన్ని పటం మధ్య పెట్టి బాబురావు ఒగ్గు కళాకారుల బృందం స్వామిపై పాటలు పాడుతూ డప్పు వాయిస్తూ బండారాన్ని ప్రసాదంగా అందరికీ అందజేశారు. స్వామికి ఆలయ మాజీ ఛైర్మన్ నల్లవెల్లి అంజిరెడ్డి దంపతులు బోనం సమర్పించారు.