తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్ ఆస్పత్రిని ప్రారంభించిన ఎంపీ రేవంత్ రెడ్డి - కంటోన్మెంట్ కొవిడ్ ఆస్పత్రిని ప్రారంభించిన ఎంపీ రేవంత్ రెడ్డి

కొవిడ్‌ ఆసుపత్రిగా సిద్ధం చేసిన కంటోన్మెంట్‌ బొల్లారం జనరల్ ఆసుపత్రిని కంటోన్మెంట్ సీఈవో అజిత్‌రెడ్డితో కలిసి ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కొవిడ్ బాధితులకు బొల్లారం ఆసుపత్రి ఎంతగానో ఉపయోగపడుతుందని రేవంత్‌ అన్నారు.

mp revanth reddy inagurated covid hospital
కొవిడ్ ఆస్పత్రిని ప్రారంభించిన ఎంపీ రేవంత్ రెడ్డి

By

Published : May 23, 2021, 2:50 PM IST

సికింద్రాబాద్ కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రిని పూర్తి స్థాయి కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చి మెరుగైన చికిత్స అందించేందుకు కృషి చేస్తున్నట్లు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. కొవిడ్‌ ఆసుపత్రిగా సిద్ధం చేసిన కంటోన్మెంట్‌ బొల్లారం జనరల్ ఆసుపత్రిని కంటోన్మెంట్ సీఈవో అజిత్‌రెడ్డితో కలిసి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కొవిడ్ బాధితులకు బొల్లారం ఆసుపత్రి ఎంతగానో ఉపయోగపడుతుందని రేవంత్‌ అన్నారు. 60 పడకలకి పైగా అత్యాధునిక సౌకర్యాలతో ఆక్సిజన్ వసతితో కొవిడ్ బాధితులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంటోన్మెంట్‌ సీఈవో తెలిపారు.

ఇదీ చదవండి :మాంసం దుకాణాల వద్ద బారులుతీరిన జనం.. కనిపించని భౌతికదూరం

ABOUT THE AUTHOR

...view details