తెలంగాణ

telangana

ETV Bharat / state

రాబోయే రోజుల్లో శక్తిని కూడగట్టి కొట్లాడతాం: రేవంత్ - జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. రాబోయే రోజుల్లో తమ శక్తిని కూడగట్టి కొట్లాడతామని రేవంత్... పార్టీ కోసం మనస్ఫూర్తిగా పనిచేసిన కార్యకర్తలను అభినందిస్తున్నట్లు తెలిపారు.

'పార్టీ కోసం మనస్ఫూర్తిగా పనిచేసిన కార్యకర్తలకు అభినందనలు'
'పార్టీ కోసం మనస్ఫూర్తిగా పనిచేసిన కార్యకర్తలకు అభినందనలు'

By

Published : Dec 4, 2020, 9:57 PM IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సర్వశక్తులు ఎదురొడ్డి కాంగ్రెస్‌ పార్టీ కోసం మనస్ఫూర్తిగా పనిచేసిన కార్యకర్తలను అభినందిస్తున్నట్లు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మొదలు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతోపాటు కేసీఆర్, కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు దిగి వచ్చినా కాంగ్రెస్ కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కొన్నారని రేవంత్ పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో తమ శక్తిని కూడగట్టి కొట్లాడతామని... మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అసాధారణంగా ఓటింగ్ నమోదైనందున ఆ సమయంలో తీసిన వీడియోలు ఎన్నికల సంఘం ప్రదర్శించాలన్నారు. ఏ రాజకీయ పార్టీకి ఇవాళ సంతృప్తిలేదన్నారు.

మొదటిసారి దురదృష్టవశాత్తు మీడియా తన పాత్రను పోషించలేకపోయిందని తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీ సొంతంగా మీడియా ఏర్పాటు చేయాల్సి రావడం రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిందన్నారు.

'పార్టీ కోసం మనస్ఫూర్తిగా పనిచేసిన కార్యకర్తలకు అభినందనలు'

ఇదీ చూడండి:టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా

ABOUT THE AUTHOR

...view details