తెలంగాణ

telangana

ETV Bharat / state

అనిశాకు చిక్కిన మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి

పోలీసు శాఖలో మరో అవినీతి తిమింగళం అనిశా అధికారులకు చిక్కింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70కోట్లు ఆస్తులు కూడబెట్టినట్లు అనిశా అధికారులు గుర్తించారు. హైదరాబాద్​తో పాటు ఇరు తెలుగు రాష్ట్రాలలో 25చోట్ల సోదాల అనంతరం మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డిని అనిశా అధికారులు గత రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అతడిని నాంపల్లిలోని అనిశా కార్యాలయానికి తరలించారు

By

Published : Sep 24, 2020, 1:29 AM IST

malkajgiri-acp-narsimhareddy-arrested-by-acb-in-illegal-assets-case
అనిశాకు చిక్కిన మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో హైదరాబాద్​తో పాటు వరంగల్, జనగాం కరీంనగర్, నల్గొండ, ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నర్సింహారెడ్డి గతంలో ఉప్పల్‌, మియాపూర్​లో సీఐగా పనిచేశారు. పలు భూవివాదాల్లో తలదూర్చి రాజీ చేసినట్టు నర్సింహారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏసీపీ నర్సింహారెడ్డి పై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలపై నిఘా పెట్టిన అనిశా అధికారుల దాడులు నిర్వహించారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్​లోని అతని నివాసంతో పాటు అతని స్నేహితులు, బంధువులు, బినామీల ఇళ్లపై బుధవారం ఉదయం నుంచి సోదాల నిర్వహించారు. సోదాల్లో ఇప్పటి వరకూ 70కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్లు తేలింది.

పలు ప్రాంతాల్లో ఆస్తులు

అనంతపురం లో 55ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించిన అధికారులు....హైదరాబాద్​లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన హైటెక్ సైబర్ టవర్స్ వద్ద 1960 గజాల నాలుగు ఇళ్ల స్థలాలు, మరో రెండు ఇళ్ల స్థలాలు, హఫీజ్ పేటలో మూడు అంతస్థుల వ్యాపార సముదాయం, నగరంలో రెండు ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో పాటు ఇంట్లో 15లక్షల నగదు, రెండు బ్యాంక్ లాకర్లతో పాటు స్థిరాస్తి వ్యాపారం, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు అనిశా గుర్తించింది. దీంతో పాటుగా యాదాద్రిలోని అతని బినామీ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు.

కోర్టులో హాజరుపరచనున్న అధికారులు

నర్సింహారెడ్డి ఇంట్లో దొరికిన బ్యాంకు లాకర్ల పై ఈరోజు అనిశా అధికారులు ఆరా తీయనున్నారు. లాకర్లలో మరి కొన్ని డాక్యుమెంట్లు లభ్యమయ్యే అవకాశం ఉంది. ఈ రోజు నర్సింహారెడ్డిని అరెస్టు చేసి అనిశా కోర్టులో హాజరు పరచనున్నారు.

ఇవీ చూడండి:అనిశా అదుపులో ఏసీపీ నర్సింహారెడ్డి..

ABOUT THE AUTHOR

...view details