తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫుట్​పాత్​లపై నివాసం.. మలయాళీల అన్నదానం - మలయాళీలు

లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటూ అన్ని దుకాణాలు మూసివేస్తుంటేనే ఎలా ఉండడం.. ఎలా తినడం అని అంటున్నాం.. మరి ఏ నీడా లేక రోడ్లపై ఉంటూ ఎవరైనా కాస్త పెడితే తిని జీవనం సాగించేవారి పరిస్థితేంటని ఆలోచించారు మలయాళీ అసోసియేషన్​ సిబ్బంది. అంతే అనుకున్నదే తడవుగా వారికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

Malayalee Society of telengana distributes food to road siders at Secunderabad Hyderabad
ఫుట్​పాత్​లపై నివాసం.. మలయాళీల అన్నదానం

By

Published : Mar 27, 2020, 11:47 AM IST

సికింద్రాబాద్​లోని పలు కూడళ్లలో ఆకలితో అలమటిస్తూ ఫుట్​పాత్​లపైనే నివాసం ఉంటున్న అనాథలు, యాచకుల ఆకలి తీర్చడం కోసం మలయాళీలు ముందుకు వచ్చారు. ఆల్ ఇండియా మలయాళీ అసోసియేషన్ వారు సికింద్రాబాద్​లోని క్లాక్​ టవర్, ప్యారడైస్ చౌరస్థాలలో రోడ్లుపై నివాసం ఉంటున్న 500 మంది అభాగ్యులకు అన్నదానం నిర్వహించారు.

ఫుట్​పాత్​లపై నివాసం.. మలయాళీల అన్నదానం

అన్నదానం చేసే ముందు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని పంపిణీ చేయడమే కాకుండా.. దానిని స్వీకరించడానికి వచ్చిన వారి మధ్యలో రెండు అడుగులు సామాజిక దూరం పాటించమని వారిని క్యూ లైన్​లో నిలుచోబెట్టి మరీ అన్నదానం చేశారు. వారికి అన్నం అందచేస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.

ఇవీ చూడండి:పారిశుద్ధ్య కార్మికులను... పట్టించుకునే నాథుడేడీ?

ABOUT THE AUTHOR

...view details