పిన్న వయస్సులో మాలావత్ పూర్ణ ఎవరెస్టు అధిరోహించి ఎంతో ఘనత తీసుకొచ్చింది. మొన్న బయోపిక్ రాగా... తాజాగా రచయిత్రి అపర్ణ తోట మాలావత్పై బయోగ్రఫీ రాశారు. ఆమె జీవితంపై రాసిన 'పూర్ణ' పుస్తకాన్ని హైదరాబాద్లో ఆవిష్కరించారు. పేద, వెనుకబడిన సామాజిక వర్గం నుంచి వచ్చిన ఆడపిల్లల ఆలోచన విధానాన్ని పూర్ణ విజయం మార్చివేసిందని రచయిత్రి అపర్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పుస్తక రచనలో ఆమె ఎదుర్కొన్న అనుభవాలు, పూర్ణ మనోభావాలు వారి మాటల్లోనే... చూద్దాం.
'మొన్న మాలావత్ పూర్ణ బయోపిక్... ఇవాళ బయోగ్రఫీ' - MALAWATH POORNA BIOGRAPHY RELEASE IN HYDERABAD
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ జీవితంపై రచయిత్రి అపర్ణ తోట 'పూర్ణ' అనే పుస్తకాన్ని రచించారు. హైదరాబాద్లో జరిగిన పుస్తకావిష్కరణకు మాలావత్ పూర్ణ, తదితర ప్రముఖులు హాజరయ్యారు.
'మొన్న మాలావత్ పూర్ణ బయోపిక్... ఇవాళ బయోగ్రఫీ'
TAGGED:
BIOGRAPHY