తెలంగాణ బిడ్డ మాలావత్ పూర్ణ పర్వతారోహణలో మరో ఘనత సాధించారు. ప్రపంచంలోని అతి ఎత్తైన పర్వతాల్లో ఒకటైన విన్సన్ మసిఫ్‌ను విజయవంతంగా అధిరోహించారు. ఈనెల 26న అంటార్కిటికా ఖండంలోని 16,050 అడుగుల ఎత్తైన విన్సన్ మాసిఫ్ పర్వతపై జాతీయ పతాకంతో అడుగుపెట్టారు. సాంఘిక సంక్షేమ కళాశాల విద్యార్థిని పూర్ణ.. ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తైన పర్వతాలను అధిరోహించాలన్న
తన లక్ష్యానికి మరింత చేరువయ్యారు.
వచ్చే సంవత్సరం దెనాలి పర్వతం
ఆరేళ్లలో ఆరు ఖండాల్లోని ఆరు ఎత్తైన పర్వత శిఖరాలపై ఆమె కాలు పెట్టారు. ఆసియాలోని ఎవరెస్టు శిఖరాన్ని 2014లో అధిరోహించిన పూర్ణ... ఆ తర్వాత వరసగా ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరప్‌లోని ఎల్బ్రస్, దక్షిణ అమెరికాలోని అకోన్ కాగ్వా, ఓషినియా రీజియన్ లోని కార్ట్స్ నెజ్ను గతంలో అధిరోహించారు. వచ్చే ఏడాది ఉత్తర అమెరికాలోని దెనాలి పర్వతంతో తన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనకు అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: జలహారతి... మానేరులో సీఎం పూజలు