ప్రతి ఒక్కరు ఇంట్లోనే అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య కోరారు. దేశానికి మంచి రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ నిమ్నజాతి ప్రజలకు మేలు చేశారని ఆయన తెలిపారు. అంబేడ్కర్ 129వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహనికి పూలమాల వేసేందుకు చెన్నయ్య రాగా... పూలమాల వేసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దూరం నుంచే అంబేడ్కర్ విగ్రహానికి నమస్కరించి తిరిగి వెళ్లారు. కరోనా వైరస్ కారణంగా విగ్రహానికి పూలమాల వేసేందుకు పోలీసులు అనుమతించ లేదని... తాము పోలీసులకు సహకరించామని ఆయన తెలిపారు.
నిమ్నజాతికి మేలు చేసిన అంబేడ్కర్ : చెన్నయ్య
నిమ్నజాతి ప్రజలకు అంబేడ్కర్ ఎంతో మేలు చేశారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు చెన్నయ్య రాగా... పోలీసులు ఆయన్ను అనుమతించ లేదు. దూరం నుంచే విగ్రహానికి నమస్కరించి ఆయన తిరిగి వెళ్లారు.
మాట్లాడుతున్న మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య