తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతి చెరువు నింపేలా ప్రణాళిక రూపొందించండి'

దేవాదుల ఎత్తిపోతల పథకం నీటి విడుదల ప్రణాళిక 2019–20 పై పంచాయతీరాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పరిధిలోని ప్రతి చెరువును నింపేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

'ప్రతి చెరువు నింపేలా ప్రణాళిక రూపొందించండి'

By

Published : Aug 19, 2019, 8:02 PM IST

Updated : Aug 19, 2019, 8:07 PM IST

దేవాదుల ఎత్తిపోతల పథకం రిజర్వాయర్​ల​ నుంచి చెరువులకు, పొలాలకు నీటిని అందించే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. దేవాదుల ఎత్తిపోతల పథకం నీటి విడుదల ప్రణాళిక 2019–20 పై మంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సాగునీటి, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని మంత్రి తెలిపారు. చెరువులను నింపే ప్రక్రియలో ఎలాంటి అడ్డంకులు లేకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం వల్ల గోదావరిలో గణనీయ స్థాయిలో నీరు ఉండటం వల్ల రిజర్వాయర్ల నుంచి నీటిని చెరువులకు తరలించాలన్నారు.

'ప్రతి చెరువు నింపేలా ప్రణాళిక రూపొందించండి'
Last Updated : Aug 19, 2019, 8:07 PM IST

ABOUT THE AUTHOR

...view details