భూ సమగ్ర సర్వేల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ధరణి వెబ్సైట్.. మాదిరి ఫేక్ మొబైల్ యాప్‌ను గుర్తు తెలియని వ్యక్తులు క్రియేట్ చేసి వెబ్సైట్లో పెట్టారు.
ధరణి వెబ్‌సైట్‌కు ఫేక్ యాప్ తయారు - ధరణి వెబ్‌సైట్‌కు ఫేక్ యాప్ వార్తలు
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ధరణి వెబ్‌సైట్‌కు దుండగులు ఫేక్ యాప్‌ను తయారుచేశారు. అది తెలియని పలువురు వాటిలో రిజిస్ట్రేషన్లు సైతం నమోదు చేసుకున్నారు. గుర్తించిన ప్రభుత్వ అధికారులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.
ధరణి వెబ్‌సైట్‌కు ఫేక్ యాప్ తయారు
ధరణి పేరుతో నకిలీ మొబైల్ యాప్ క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని.. ఐదు రోజుల క్రితం టీఎస్టీఎస్ డైరెక్టర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఐపీ అడ్రస్ ఆధారంగా కర్ణాటకలోని బసవ కళ్యాణ్ గ్రామానికి చెందిన మహేష్, ప్రేమ్ మూలె అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. విచారణ నిమిత్తం రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చూడండి:నియమావళి ఉల్లంఘించిన 14 మందిపై కేసులు