జాతీయ స్థాయి మజిల్మానియా పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన యువకుడు విజేతగా నిలిచాడు. హైదరాబాద్ అత్తాపూర్ డైరీ ఫామ్‌కు చెందిన మహ్మద్ అక్రమ్‌కు చిన్నతనం నుంచే కసరత్తులంటే ఎనలేని మక్కువ. వ్యాయామంపై ఆసక్తితో ఎక్కువ భాగం జిమ్‌లోనే గడిపేవాడు. కఠోర ఆహార నియమాలు పాటిస్తూ జాతీయ స్థాయి పోటీలకు సిద్ధమయ్యాడు. ముంబైలో జరిగిన తుది పోటీల్లో విజేతగా నిలిచి తన కలను సాకారం చేసుకోవడమే కాకుండా రాష్ట్రానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాడు.
మజిల్ మానియా జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన హైదరాబాదీ
కండగలిగిన వాడే మనిషోయ్ అన్న గురజాడ మాటలను వంటి పట్టించుకున్నాడు ఆ యువకుడు. మజిల్ మానియా ( కండరాల ప్రదర్శన) పోటీల్లో భాగ్యనగర యువకుడు జాతీయ స్థాయిలో సత్తాచాటాడు. మజిల్స్ మానియా పోటీల్లో అత్తాపూర్‌కు చెందిన మహ్మద్ అక్రమ్ జాతీయ స్థాయి పోటీలో విజేతగా నిలిచాడు.
మజిల్ మానియా భాగ్యనగరానిదే
అత్తాపూర్‌లోని ఓ ఫిట్నెస్ సెంటర్లో శిక్షకుడిగా పని చేస్తున్న అక్రమ్ ప్రణాళిక ప్రకారం శ్రమిస్తే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని అంటున్నాడు. ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం అందిస్తే రాష్ట్రం పేరు నిలబెడతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో అక్షరాస్యత పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు
TAGGED:
majil mania