తెలంగాణ

telangana

ETV Bharat / state

నగరవాసులను రారమ్మంటున్న జంగిల్​ ఫారెస్ట్​ క్యాంప్​ - Majidgadda jungle camp forest news

హైదరాబాద్ నగర శివారు శంషాబాద్​కు అతిసమీపంలో మజీద్ గడ్డ వద్ద ఏర్పాటు చేసిన జంగిల్ క్యాంప్​ను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితాఇంద్రా రెడ్డి ప్రారంభించారు.

Majidgadda jungle camp forest
జంగిల్​ ఫారెస్ట్​ క్యాంప్​ను ప్రారంభించిన మంత్రులు

By

Published : Dec 19, 2019, 6:02 PM IST

గజిబిజి జీవితాలను పక్కనపెట్టి ప్రకృతితో గడిపే సౌకర్యాన్ని కల్పిస్తున్న జంగిల్​ ఫారెస్ట్ క్యాంప్​ని సందర్శించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నగరవాసులను కోరారు. హైదరాబాద్ నగర శివారు శంషాబాద్​కు అతిసమీపంలో మజీద్ గడ్డ వద్ద ఏర్పాటు చేసిన జంగిల్ క్యాంప్​ను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. సుమారు 400లకుపైగా ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్కు నగర వాసులకు సరికొత్త ఆహ్లాదాన్ని అందించే లక్ష్యంతో ఏర్పాటు చేశారు.

హైదరాబాదీలకు మరో అద్భుతమైన పార్కు అందుబాటులోకి వచ్చిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న ఖాళీ స్థలాల్లో మరిన్ని పార్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా ఎడ్వెంచర్ గేమ్స్, ఫారెస్ట్ క్యాంప్ ఫైర్, కాటేజీల సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మౌంటైన్ క్లైంబింగ్, ఎడ్వెంచర్ సర్క్యూట్​లను మంత్రులు ఆసక్తిగా తిలకించారు.

జంగిల్​ ఫారెస్ట్​ క్యాంప్​ను ప్రారంభించిన మంత్రులు

ఇవీచూడండి: హైదరాబాద్​లో 'పౌర' సెగ: వామపక్ష నేతల అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details