‘వండర్‌ఫుల్ కేటీఆర్(Wonderful Ktr)! నాయకత్వం, వినయం అనే అంశాలు విడదీయరానివి అనడానికి మీరు అసాధారణమైన ఉదాహరణగా నిలిచారు’ అంటూ మహీంద్రా గ్రూపు సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ఇటీవల హైదరాబాద్ సనత్‌నగర్‌లో టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నాని.. మంత్రి కేటీఆర్‌తో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో వర్షం పడటంతో కేటీఆర్ స్వయంగా సీపీ గుర్నానికి గొడుగు పట్టారు. ఓ రాష్ట్రానికి మంత్రి, తమ కార్యక్రమానికి ముఖ్యఅతిథి అయిన ఆయన తన పట్ల చూపిన శ్రద్ధకు గుర్నానీ ముగ్ధుడయ్యారు.
Wonderful Ktr: నాయకత్వం, వినయం రెండింటికీ కేరాఫ్ కేటీఆర్: ఆనంద్ మహీంద్రా - కేటీఆర్‌ను అభినందించిన ఆనంద్ మహీంద్ర
‘వండర్‌ఫుల్ కేటీఆర్! నాయకత్వం, వినయం అనే అంశాలు విడదీయరానివి అనడానికి మీరు అసాధారణమైన ఉదాహరణగా నిలిచారు’ అంటూ మహీంద్రా గ్రూపు సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. దీనిపై స్పందించిన మంత్రి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
తన స్పందనను శుక్రవారం ట్విటర్ ద్వారా వెలిబుచ్చారు. ‘మీరు మనస్ఫూర్తిగా వ్యవహరించిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. మీ స్థాయి వ్యక్తి నాకు గొడుగు పట్టడం అరుదైన విషయం. అందుకు నా కృతజ్ఞతలు’ అంటూ గుర్నాని.. తనకు కేటీఆర్ గొడుగు పట్టిన ఫొటోను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. తమ సంస్థ సీఈవో వ్యాఖ్య, ఫొటోను ట్యాగ్ చేస్తూ ఆనంద్ మహీంద్రా.. కేటీఆర్‌ను ట్విటర్‌లో అభినందించారు. దీనిపై స్పందించిన మంత్రి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:Shashi Tharoor: తెలంగాణ ఐటీ పాలసీ దేశంలోనే ఆదర్శం: శశి థరూర్