రాచకొండ పరిధిలోని నేరేడ్మెట్లో ఏర్పాటు చేసిన భూమిక కౌన్సెలింగ్ సెంటర్ను మహేశ్ భగవత్ ప్రారంభించారు. మహిళలకు లీగల్గా సేవలు అందించేందుకు దీనిని స్థాపించినట్లు సంస్థ నిర్వాహకురాలు సుమిత్ర పేర్కొన్నారు. సమస్యలతో వచ్చిన మహిళలకు సలహాలు ఇచ్చేందుకు ఇక్కడ ఇద్దరు కౌన్సెలర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాచకొండ పరిధిలోని 46 పోలీస్ స్టేషన్లకు దీనిని అనుసంధానం చేసినట్లు ఆమె తెలిపారు. అందిస్తున్న సేవలకు గానూ, ఎటువంటి ఫీజు ఉండదని సుమిత్ర స్పష్టం చేశారు.
మహిళా సమస్యల పరిష్కారానికై కౌన్సెలింగ్ సెంటర్
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన భూమిక కౌన్సెలింగ్ సెంటర్ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ప్రారంభించారు.
మహిళా సమస్యల పరిష్కారానికై కౌన్సెలింగ్ సెంటర్: సుమిత్రా