కరోనాపై చేస్తున్న యుద్ధంలో భాగమైన వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులపై ప్రశంసలు కురిపిస్తూ బుధవారం నాగచైతన్య ట్వీట్ చేశారు. తాజాగా మహేశ్‌బాబు తెలంగాణ పోలీసులకు తన ట్విట్టర్ ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ పోలీసులకు నా సెల్యూట్: మహేశ్‌బాబు - mahesh babu tweet on telangana police
కరోనా వైరస్ నివారణలో భాగంగా తెలంగాణ పోలీసుల కృషిపై సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రశంసల వర్షం కురిపించారు. కోవిడ్-19కు వ్యతిరేకంగా రాష్ట్ర పోలీసులు చేస్తున్న యుద్ధానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
తెలంగాణ పోలీసులకు నా సెల్యూట్: మహేశ్‌బాబు
కోవిడ్-19కు వ్యతిరేకంగా తెలంగాణ పోలీసులు చేస్తున్న యుద్ధాన్ని ఆయన ప్రశంసించారు. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని కాపాడేందుకు వారు చేస్తున్న కృషి అసాధారణమైనదని పేర్కొన్నారు. దేశం కోసం, ప్రజల కోసం నిస్వార్థంగా అంకిత భావంతో పనిచేస్తున్న పోలీసులందరికి సెల్యూట్ చేస్తున్నట్లు మహేశ్ ట్వీట్ చేశారు.