మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతిని అందరూ ఇళ్లలోనే నిర్వహించుకోవాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. రేపు నిర్వహించబోయే జ్యోతిబా ఫూలే జయంతిని ఎలాంటి సమావేశాలు, సమూహాలు లేకుండా భౌతిక దూరం పాటిస్తూ జరుపుకోవాలని ఆయన సూచించారు. కరోనా వైరస్ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు జారీ చేసిన ఉత్తర్వులను జీహెచ్ఎంసీ కమిషనర్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కమిషనర్, అన్ని జిల్లాల కలెక్టర్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
'మహాత్మ ఫూలే జయంతిని ఇళ్లలో నిర్వహించుకోండి' - corona updates
మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతిని ఇళ్లలోనే నిర్వహించుకోవాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం స్పష్టం చేశారు.
'మహాత్మ పూలే జయంతిని ఇళ్లలో నిర్వహించుకోండి'