మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు.. జాతి పితకు నివాళులు అర్పించారు. లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్ వద్ద జాతిపిత విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.
మహాత్ముడికి నివాళి అర్పించిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి సందర్భంగా లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.
మహాత్ముడికి నివాళి అర్పించిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
కార్యక్రమంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు సత్యవతి రాఠోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.