ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి హక్కుల కోసం పోరాడిన మహనీయుడు మహాత్మ జ్యోతిబా ఫూలే అంటూ.. నగర మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కొనియాడారు. హైదరాబాద్ బోరబండలో నిర్వహించిన 194వ ఫూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
'ఫూలే.. ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు' - బాబా ఫసియుద్దీన్
హైదరాబాద్ బోరబండలో మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగర మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఫూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఫూలే అందించిన సేవలను స్మరించుకున్నారు.
మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి
ఫూలే.. సమాజంలో నెలకొన్న సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పనిచేసి ప్రజలను చైతన్యపరిచాడని ఫసియుద్దీన్ వివరించారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్దరణకు కృషి చేశారని గుర్తు చేశారు. యువత.. ఫూలేను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని సూచించారు.