తెలంగాణ

telangana

ETV Bharat / state

మహారాష్ట్ర స్పీకర్​కు ఏఐసీసీ నాయకుల ఘనసన్మానం - మహారాష్ట్ర స్పీకర్​కు ఏఐసీసీ ఘనసన్మానం

మహారాష్ట్ర స్పీకర్ నానా బాహు ఫల్గుణరావ్ పటోలేను ఏఐసీసీ కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో ని ఓ హోటల్‌లో ఘనంగా సన్మానించారు.

congress
మహారాష్ట్ర స్పీకర్​కు ఏఐసీసీ నాయకుల ఘనసన్మానం

By

Published : Jan 19, 2020, 11:03 PM IST

మహారాష్ట్ర స్పీకర్ నానా బాహు ఫల్గుణరావ్ పటోలే రైతుల పక్షాన ఎన్నో ఉద్యమాలు చేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు కొనియాడారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు తిండి లేక అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇక్కడ రైతులు హక్కుల కోసం పోరాటం చేస్తే... బేడీలు వేసి అవమాన పరచడమేకాకుండా, జైళ్లలో కూడా పెట్టారని విమర్శించారు. పటోలేను ఏఐసీసీ కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని ఓ హోటల్‌లో ఘనంగా సన్మానించారు.

భాజపా ఎంపీగా ఉండి రైతుల కోసం పటోలే కాంగ్రెస్​లో చేరారని... అధికార పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చి వచ్చిన నాయకుడని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ కొనియడారు. రైతుల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి మహారాష్ట్ర స్పీకర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించడం గొప్ప విషయమని అభిప్రాయపడ్డారు.

మహారాష్ట్ర స్పీకర్​కు ఏఐసీసీ నాయకుల ఘనసన్మానం

ఇవీ చూడండి: 'రాష్ట్రాలు వేరైనా... సంస్కృతి, సంప్రదాయాలు ఒకటే'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details